Tuesday, September 22, 2009

మనిషిని తప్పుడు త్రోవను పట్టించేవన్నీ కలగలిసినపుడు

మనమందరము చిన్నపుడు కామ,క్రోధ,లోభ,మద మరియు మాత్స్యర్యములనేవి అరిషడ్వర్గములని చాలా మార్లు చదివివుంటాము.కాని వయసు వచ్చేకొద్దీ అదేమి ఖర్మమో మన విషయ బుద్ధి వికసించి,ఙ్నాన బుధ్ధి క్షీణించడం మొదలవుతుంది. ఒక మగాడు నాశనం అయ్యే కారణాలలో ముఖ్యమైనది స్త్రీ పిచ్చి అని నా నమ్మకము. కావాలంటే పరిశీలనగా చూడండి పై మొదటి వాక్యాన్ని, ఐదు లక్షణాలలో దేనికి మన పూర్వీకులు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చారో. ఎంత వారలమైనా కాంత దాసులమే అన్న నానుడిని నిజం చేస్తూ, ఎంతో ఎదగవలసిన మగాడు అధఃపాతాళానికి జారి పోతాడు.నీచమైన పనులు చేస్తూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందాన ప్రవర్తిస్తుంటాడు.అదేమంటే తన టెన్షన్ ను అలా రిలీవ్ చేసుకొంటుంటానని బుకాయిస్తుంటాడు! లారీ డ్రైవర్ టెన్షన్ లారీ డ్రైవర్ ది మరి,ఎక్కడ ఏక్సిడెంట్ చేస్తానేమోనని, అలాగే డబ్బులు సంపాదించేవాడి టెన్షన్ వాడిది, ఇంకా ఎక్కువ సంపాదించాలని మరియు వున్నది ఎక్కడ పోతుందేమోనని. అధికారంలో వున్నవాడికి అదే తంటా మరియు అది తెచ్చే టెన్షన్. ఇలా వీళ్ళు అందరూ ఒకే చందాన చీకటి వేళకు రిలాక్సేషన్ కోసం ప్రయిత్నిస్తారు,స్థలాలు మారుతాయి అంతే తేడా! దీనికి చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. నాటి రావణాసురుడు,ఇంద్రుడు,కీచకుడు,బాల నాగమ్మ ను మోహించిన మాయల ఫకీర్ నుంచి నేటి బిల్ల్ కింటన్, రామారావు, సిల్వియొ బెర్లుస్కోని, మా ఎం ఎల్ ఎ, నికొలాస్ సార్కోజీ,నారాయణ ఇలా ఎందరో. బయిటపడని ఘటికులు గూర్చి చెప్పనవసరములేదు. ఫైనల్ గా అర్ధమైనది ఏమిటంటే క్రోధం లేక లోభం కానివ్వండి. మద,మాత్సర్యాలు కానివ్వండి.చివరకు ఇవి కూడినపుడు వుద్భవించేది కామం అనే మహా వినాశనహేతువు. పోనీ ఇలా బ్లాగులలో చూస్తామా ,ఆహ,ఓహో అంటూ కొన్ని స్త్రీల బ్లాగులను కామెంట్లతో ముంచెత్తే భట్రాజులు.

4 comments:

శరత్ కాలమ్ said...

మీ ఎం ఎల్ ఏ పేరు చెప్పారు కాదు.

Krishna K said...

"ఆహ,ఓహో అంటూ కొన్ని స్త్రీల బ్లాగులను కామెంట్లతో ముంచెత్తే భట్రాజులు. " ఇది మాత్రం ఎవరి గురించి వ్రాసారో అర్ధమయ్యింది. బ్లాగ్లోకం లో, నేనేనా, ఇంకెవరయినా ఇది గమనిస్తున్నరా అని అనుకొనేవాడిని.

Vinay Chakravarthi.Gogineni said...

mmm
బాగా రాశారు........ఆ చివరి లైన్" " మాత్రం కేక.అసలు పోస్ట్ కూడా పెద్ద కేక.

భాస్కర రామిరెడ్డి said...

ఆహా ఓహో ఆహాహా :)

Read my post and bloggers feedback

http://chiruspandana.blogspot.com/2009/04/blog-post_19.html