Friday, October 5, 2007

ట్రాఫిక్ జోక్స్

హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన చంద్రమోహన్, friend రాంమోహన్ ఇంట్లో దిగాడు.రాంమోహన్ వుండేది అమీర్ పేటలో.ప్రతీరోజు నాలుగుగంటలకు ఒక మారు helicopter చక్కర్లు కొట్టడం చూసి అడిగాడు-ఇక్కడేమైన దగ్గర్లో helicopter training center వున్నదా?
రాంమోహన్: అబ్బే అదేమి లేదు!
చంద్ర మోహన్: మరి ఆ helicopter అన్ని సార్లు ఎందుకు తిరుగుతోంది?
రాంమోహన్(పక పక నవ్వేస్తు): అది traffic jam లో ఇరుక్కున్న వాళ్ళకు ఆహార పొట్లాలు విడవడానికి!!!!!
**********************************************************************
పెళ్ళయి హైదరాబాద్ లో settle కాదల్చుకొంటే డబ్బులుగడించిన మామను అల్లుడు కోర్కే కోరిక ఏమిటి?!

"ఒక helicopter ను కొనివ్వండి. Traffic jam ను తట్టుకోలేను."
***********************************************************************
లకడీకాపుల్ బిచ్చగాడు పంజాగుట్ట బిచ్చగాడితో- " ఈ traffic jam ల పుణ్యమాని మనం తిరిగే బాధ తప్పింది"...!!!!!
************************************************************************

Saturday, September 15, 2007

Traffic లో tea తాగగలరా?!!!

ఇదేదో పిచ్చి ప్రశ్నలా వుంది కదూ? కాని ఇది నిజం!హైదరాబాద్ గూర్చే తీసుకోండి.ఇక్కడ vehicle నడపడానికి కూడ ఎడమ దొరకని విధంగా traffic వుంటుందన్నది జగమెరిగిన సత్యం.విస్తరించలేని roads,వాటిమీదకు చొచ్చుకువచ్చిమరీ వ్యాపారాలు చేసే shops,అడ్డదిడ్డంగా park చేసిన vehicles మరియు తోపుడు బళ్ళు. ఇక traffic jam కాకుండా ఎలా వుంటుంది?! నేను పని చేస్తున్న యశోద hospital, సోమాజిగూడ వద్ద traffic స్థంభించిపోవడం షరా మామూలే.అలా traffic నిలబడిందో లేదో చాలు,6 నుంచి 14 సంవత్సరాలు మధ్య వయస్సు వున్న పిల్లలు టక్కున ప్రత్యక్షమవుతారు "చాయ్, చాయ్" అని అరుస్తూ.చేతుల్లొ tea can మరియు disposable cups ready గా వుంటాయి.టూ వీలర్స్ చోదకులు ఈ వ్యాపారానికి మహరాజ పోషకులు!ఎలాగూ jam కనీసము 5 నిముషములు వుంటుంది కాబట్టి ఈ business కూడ బాగానేవున్నట్టుంది!!

Tuesday, September 11, 2007

బాబోయ్,రద్దీ !!!!!

మన భారత దేశనియమాల ప్రకారము,మనము మన vehicles ను ఎడమ వైపు నడపాలి.కాని దాని అసలు,సిసలు అర్ధం ఎక్కడ ఎడమ దొరికితే,అక్కడ నడపమని!హైదరాబాద్ traffic ను మొదటి మారు చూసినప్పుడు,మరీ ఈ అమీర్ పేట వద్ద దారుణం అని చెప్పాలి.ఇరుకు roads ఒక కారణం అయితే,ముఖ్యమైన కారణం మన civic sense లేని వాహన చోదకులే.ఒక flyover అక్కడ అత్యవసరమని మన government కూడ ఏనాడో మరచిపోయింది.చివరకు అంబులన్సులు,ట్రాఫిక్ పోలీసింగ్ వాహనాలు కూడ స్తంభించిపోయి ఒక ఇంచి కూడ కదలలేని పరిస్థితిలో వుండడము షరామామూలే. మనకు ఎక్కడా కనీసము ఒక foot-overbridge కూడ కనుపించదు.ఎటువంటి markings లేని చోట కూడ పాదాచారులు యదేచ్చగా road ను దాటుతూ కనబడడము నిత్యకృత్యం.ఒక వేళ మనమే ఒక vehicleను drive చేయాల్సిన దురదృష్టం పట్టితే,మనము బ్రహ్మ లాగు చతుర్ముఖుడై వుండాలని ఓ అభిప్రాయము వుండేది-ఏ వైపు నుంచి ఏ vehicle నో లేక పాదాచారో హటాత్తుగా వస్తే save కావడానికి! కాని ఈ నా అభిప్రాయాన్ని పంజాగుట్ట flyover కూలిన పిమ్మట మార్చుకున్నాను,మనము ఈ hyderabad లో బతికి బయట కట్టాలంటే పంచముఖ బ్రహ్మ అయివుండాలి అని. ఎక్కడి నుంచి ఏ బండనో లేక ఏ కరెంట్ కేబులో నెత్తిన పడబోతుంటే కనీసము పారిపోవడానికి సమయం అన్నాదొరుకుతుంది.

Sunday, September 9, 2007

Power of emotion

పెద్ద బుర్రలు ( wise heads) ఏమంటారంటే head should rule the heart.కాని నాకు అనిపిస్తుంది,చివరకు మనలను guide చేసే శక్తి emotion అని. మనము తరచుగా చూస్తూ వుంటాము companies/corporates యొక్క tag lines- "touching your heart", "touching the hearts". అలా చేసే comapnies కూడ చిన్న చితకవి కావు.అంటే వాళ్ళు ఇలా చేయడం వాళ్ళకు తెలీకనా లేక మన emotionను stimulate చేసే business tacticsనా?నాకు మటుకు రెండోదే కారణం అని తోస్తోంది.
ఒక స్థాయికి మనిషి చేరాలంటే బుర్ర (mind) definite గా అవసరం.కాని చివరికి అతన్ని guide చేసే force ఏమిటని తరచి చూస్తే,అది emotion from the heart అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనం తలిదండ్రులను ప్రేమిస్తాము,అది బుర్రతో కాదు,కేవలం ఏ స్వార్ధం ఆశించని emotion తో నే.అలాగు ఓ famous personality ని ఆరాధిస్తాము,కేవలం emotion తో.వాళ్ళ వల్ల మనకు ఒనగూడేది ఏమీ వుందదని mind కు తెలుసు.అయినా మనం వాళ్ల విజయాలవలన ఆనందం పొందుతాం.వాళ్ళు ఓడితే,దుఃఖిస్తాము.
అలాగూ మనం ఓ job లో satisfaction పొందుతున్నామంటే దాని అర్ధం మనం ఆ వుద్యోగానికి emotionally linked అని.కేవలం బుర్ర తో పని చేస్తూవుంటే,అది mechanical అవుతుందే తప్ప మరేమీ కాదు.ఒక్క మాటలో చెప్పలంటే అది నిస్సందేహముగా under performance.Emotion అనేది extraordinary మరియు average work మధ్య తేడాను generate చేస్తుంది.

Friday, September 7, 2007

Chandigarh,memorabilia

I remember with much reverence,those times when in winter evenings we (my wife Devasena,2 kids and my late father) walked to and fro from our home at sector 15 to sector 17,Chandigarh decked in warm clothes.Some window shopping,some actual buying,some scoops of icecream for kids and finally dinner at Sindhi restaurant/Hot millions which ever is less crowded.We preferred Sindhi( vegetarian) even though we are hard non -veggies for its quality.We used to put our legs out by 7.30 pm after another day of evening rounds at PGI Endocrinology department.As grand rounds by HOD are on Fridays,we were psychologically relaxed by that evening!!!!!What a wonderful colleagues and friends(SRs, even JRs) i had. Ajith is the best Endo SR with whom i had worked with. We used to bunk some evenings on Friday/Saturday alternatively.I utilized such moments to spend time with family though as an SR i don't have many bucks.Yet the most memorable moments of my Chandigarh part is that walk.When we reach home its usually 11.00 pm; yet we find it is the safest city in India where one can roam even alone ,leave alone unpolluted,pleasant breeze all over.

Wednesday, September 5, 2007

ఎవరు వుమ్మింది? భారతీయుడా?!

వుమ్మడం మన జన్మహక్కు.కాదంటారా?!School కు వెళ్ళే వయసులోనే వుమ్మడం మన తోటి భారతీయులు అసంకల్పితంగా నాకు నేర్పడం బాగా గుర్తువుంది! కరక్టే,మన వూళ్ళను ఎర్రటి పిచికారి చేసి,అందంగా తీర్చిదిద్దకపొతే మన సహోదరులు ఆగ్రహించరూ?! ప్రపంచంలోకెల్లా నిజమయిన communists ఎవరంటే నా సమాధానం-మాణిక్ చంద్ మరియు పాన్ పరాగ్ వాలా.సత్యమండి,ఒక వేళ karl marx Indiaకు వచ్చివుంటే,ఈ నిస్వార్ధ సేవకు ఆనందభాష్పాలు కార్చేవాడేమో ? !! నాకు ఆటొ లేక రిక్షా పక్కనో నడవాలంటే అదో భయము!ఇక city bus లేక 2-wheeler పక్కనుంచి వెళ్తుందంటే నా మనసు గూర్చి చెప్పనలవి కాదు.మరి భారతీయుడినై జన్మించినందుకు ఆ మాత్రం వుమ్మించుకోకపోతే ఎలా మరి?!నా సహోదరులు బాధపడరూ?! మన ఇళ్ళు మటుకు శుభ్రంగా వుండాలి,వెలుపల ఏమిచేస్తే ఏమి?ఎవరు మనలను ప్రశ్నించగలిగేది?! మన ఇల్లునే మనకు india.బయటంతా పరాయి.అవును,India మన ఇల్లు కాదు.ఇంటికి ఇచ్చే గౌరవం మనం India కు ఎందుకివ్వాలి?నేను ఏమి దేశోధ్ధారకుడిని కాదు కాబట్టి,కనీసము భగవంతుడినైనా ప్రార్ధిస్తాను,నా దేశ ప్రజలను ఈ అసహ్యకరమయిన అలవాటు నుంచి బయటపడేయమని!

తెలుగు వాళ్ళు,అనామకులు

తెలుగు వాళ్లలో ఎంతో మంది తెలివిగల వాళ్ళు, even genius లు కూడా వున్నారనడంలో సందేహం లేదు.కాని అసలు మనల్ని మనము గుర్తించుకొంటున్నామా?ఒక విషయం మటుకు వాస్తవం.భారతదేశములో ఆంధ్ర ప్రదేశ్ border వెలుపల ప్రజలు చాలమందికి తెలుగువాళ్ళ గూర్చి అసలు తెలియదు.North Indiaలో మనగూర్చి తెలిసింది శూన్యమని చెప్పాలి.మధ్యమధ్యలో తమిళ్నాడు ,కర్నాటక గూర్చో లేక కేరళ వార్తలు తెలుస్తుంటాయి గాని మనల్ని ఒక్క నాధుడూ పట్టించుకొనే పాపానికి పోడు. మనలో ప్రతివారికి అమితాబ్ బచ్చన్ ఎవరో తెలుసు.అతని పేరు భారతదేశము వెలుపుల కూడ వ్యాపితము.కాని andhra వెలుపల ఎంతమందికి NTR,ANR ల గూర్చి తెలుసు?ఏ తెలుగు రచయిత పరిచయమున్నాడు andhra border బయట?కాని మనకు ప్రేంచంద్,శరత్,తస్లీమనస్రీన్ లంటే కొట్టిన పిండి!బాపు-రమణ ద్వయం(genius combination) ఎంతమంది తెలుగేతరులకు తెలుసు?విశ్వనాథ్ ఎవరని ప్రశ్నిస్తే వాళ్ళు కళ్ళు తేలవేస్తారు.అసలు మనలోనే ప్రశ్నించిచూడండి-రావూరి భరద్వాజ ఎవరని.ఎంతమందికి తెలుసో మీకే తెలుస్తుంది.ఇలాంటి వుదాహరణలు ప్రతి రంగం లో కోకొల్లలు.ఎంతో మంది మహానుభావులు మౌనంగానే వెళ్ళిపోయారు.ఇటువంటి పరిస్థితికి కారణహేతువులు మనమే.మనలను మనం గుర్తించుకోనపుడు,బయటి వాళ్ళెవరో వచ్చి దండలు వేస్తారనుకొవడం హాస్యాస్పదం.