Wednesday, September 5, 2007

ఎవరు వుమ్మింది? భారతీయుడా?!

వుమ్మడం మన జన్మహక్కు.కాదంటారా?!School కు వెళ్ళే వయసులోనే వుమ్మడం మన తోటి భారతీయులు అసంకల్పితంగా నాకు నేర్పడం బాగా గుర్తువుంది! కరక్టే,మన వూళ్ళను ఎర్రటి పిచికారి చేసి,అందంగా తీర్చిదిద్దకపొతే మన సహోదరులు ఆగ్రహించరూ?! ప్రపంచంలోకెల్లా నిజమయిన communists ఎవరంటే నా సమాధానం-మాణిక్ చంద్ మరియు పాన్ పరాగ్ వాలా.సత్యమండి,ఒక వేళ karl marx Indiaకు వచ్చివుంటే,ఈ నిస్వార్ధ సేవకు ఆనందభాష్పాలు కార్చేవాడేమో ? !! నాకు ఆటొ లేక రిక్షా పక్కనో నడవాలంటే అదో భయము!ఇక city bus లేక 2-wheeler పక్కనుంచి వెళ్తుందంటే నా మనసు గూర్చి చెప్పనలవి కాదు.మరి భారతీయుడినై జన్మించినందుకు ఆ మాత్రం వుమ్మించుకోకపోతే ఎలా మరి?!నా సహోదరులు బాధపడరూ?! మన ఇళ్ళు మటుకు శుభ్రంగా వుండాలి,వెలుపల ఏమిచేస్తే ఏమి?ఎవరు మనలను ప్రశ్నించగలిగేది?! మన ఇల్లునే మనకు india.బయటంతా పరాయి.అవును,India మన ఇల్లు కాదు.ఇంటికి ఇచ్చే గౌరవం మనం India కు ఎందుకివ్వాలి?నేను ఏమి దేశోధ్ధారకుడిని కాదు కాబట్టి,కనీసము భగవంతుడినైనా ప్రార్ధిస్తాను,నా దేశ ప్రజలను ఈ అసహ్యకరమయిన అలవాటు నుంచి బయటపడేయమని!

4 comments:

Unknown said...

బావుంది సెటైరు.

karl marx Indiaకు వచ్చివుంటే,ఈ నిస్వార్ధ సేవకు ఆనందభాష్పాలు కార్చేవాడేమో ? !!
హహహ:)

KKG said...

చాలా బాగా వ్రాశారుఅండి!. ఒకసారి అలాగే నేను కూడా మా వూళ్ళో ఒకానొక రాత్రి నక్కను తొక్కి తెలుగు సినిమా హాలు కి వెళ్ళి కూర్చున్నా! ఏదో గోడకి ఒక రెండు సీట్ల అవతలి సీటు దొరికింది. ఒకాసారి హాలు అంతా పరికించి చూశా! గోడకు మాత్రం ఒక మూడు అడుగుల ఎత్తు వరకు ఏదో ముదురు రంగు సున్నం అంతా ఎగుడుదిగుడుగా కనపడింది. అప్పటికే సినిమా మొదలు అవ్వడం వలన సరిగ్గా కనపడక, ఎవడబ్బా ఆ గోడను సరిగ్గా paint చెయ్యని వెధవ అని అనుకొని అలాగే దోమలు తోలుకుంటూ సినిమాలో మునిగిపొయ్యా! సరే ఇంతలో interval వచ్చింది. బయటికి వెళ్ళి వస్తూ వుండగా నా చూపు మళ్ళా ఆ గోడ మీదకు వెళ్ళింది. చూద్దును కదా అది మన కిళ్ళీ బాబుల ఎర్రరంగు పిచికారి! చి ఇంక నాకు ఆ పక్కనే వున్న కిటికిలో నుంచి కిందకి దూకాలనిపించింది. ఎందుకులే సినిమా బాగులేదని తెరలు చించుతామా, అమ్మాయిలు నచ్చలేదని కాలేజిలు మారుతామా అని అదేదో సినిమా డైలాగు తల్చుకుని, ఇది అంతే అనుకుని ఎలాగొలా ఆ సినిమా చూసి బయటపడ్డాను. ఇంకా నయం, నాకు ఆ గోడ పక్కన సీటు ఇచ్చాడు కాదు. interval వరకు నా వుత్సాహం ఆపుకోలేక ఓ సారి తడిమి చూసి వుండేవాడిని అనిపించింది. ఇక ఆ తరువాత ఆ చెయ్యిని ఏ రైలు కిందో పెట్టవలసివచ్చేది!

chanukya said...

KKG గారూ,బాగా చెప్పరండి.అందువల్లే Movie theatres కు వెళ్ళడం అసలు మానుకొన్నానండి!

chanukya said...

అయ్యో KKG గారూ,typing mistake జరిగిందండి!బాగా "చెప్పారండి" అని వ్రాయబోయి(Lekhini),అలా ఓ "a" miss అయి "చెప్పరండి" అని post అయిందండి.క్షంతవ్యుడిని.నొచ్చుకోకండేం