Monday, July 7, 2008

సొగసు చూడతరమా!!!!






















వెల్ కం టు నెల్లూర్.
మా వూరికి రండి.మా ప్రగతిని చూడండి.మా వున్నతనాన్ని ఆస్వాదించండి.మా వూళ్ళొ మీకు చాలా వుచితంగా దొరుకుతాయి!టీబి,డయేరియా,టైఫాయిడ్,ఫైలేరియ తో పాటు ఐరన్ ఓర్ వల్ల కలిగే వింత వ్యాది కూడ విరివిరిగా లభిస్తుంది.కడప జిల్లానుంచి వచ్చే ఐరన్ ఓర్ లారీల వలన ఎంతో మంది వ్యాదుల బారిన పడుతుంటే,రహదారులు చిద్రమవుతుంటే నాకేమిటి,నేను నా ఇల్లు సుఖంగా వుంటే చాలు అన్న మనస్తత్వం మాది.ఇంత భారీ ప్రాజెక్టు సాగుతుంటే దానికి తగ్గ వసతి (కడప నుంచి క్రిష్ణపట్నం వరకు) ప్రత్యేక రోడ్ వేయాలని ప్రభుత్వం మర్చిపోగా, దానిని గుర్తు చేయాల్సిన మేము "తిన్నామా, పడుకొన్నామా,తెల్లారిందా" అనే దానిని తూ చా తప్పకుండా అమలుపరుస్తునాము!ఇళ్ళు కట్టడము,పిల్లలను చదివించడము,డబ్బు వెనుక పోగేసుకోవడం అనే మూడిటి నుంచిబయటపడని అచ్చమైన తెలుగు వారం మనము!ఈ మూడు తప్ప మరేదైన వున్నతమైనది ఈ లోకంలో వున్నదా అనే ఆలోచనను కట్టిపడవేసాం!ఈ సంకుచిత్వ భావాల ప్రతిబింబమే మన రాజకీయనాయకులు మరియు అధికారులు.వాళ్ళని ఆడిపోసుకుని ప్రయోజనము ఏమున్నది?ఇంత నేరో మైండెడ్ మెంటాలిటీ వున్నంతవరకు మన దేశం పురోగమించదు.మనకు ప్రతిరూపమైన ,మా నేరో రోడ్స్ ని చూడండి!
పచ్చదనం కానరాక,కాల్చేస్తున్న ఎండలతో సహజీవనం చేస్తాం! కొద్దిపాటి వర్షానికే మురుగుకాలువ నీళ్ళు భేదాపరాలు లేకుండా అంతా చేరుతాయి!గుంటనో మిట్టనో కానరాదు.అయినా ఫర్వాలేదు.పడిలేచి బురదను వాషింగ్ మెషిన్ లో వేస్తాం!రోడ్డు మీదనే యదేచ్చగా వుమ్మేస్తుంటాము,గోడ దొరికితే పాసులు పోస్తుంటాము!మన వాహనాన్ని ఎక్కడైన ఆపగలము,వెనుక బస్సులుఇతరత్రా హారను కొడుతున్నా!అదే దుమ్ము గాలిని ఆస్వాదిస్తూ,టీ తాగి,ప్లాస్టిక్ కప్ ని రోడ్ మీద పడవేస్తాం!స్వార్దానికి నిలువెత్తు ప్రతిరూపాలు,మన తెలుగు వాళ్ళము.పుస్తకాలలోని నీతులు పిల్లవాళ్ళకు చెప్పినా,వాళ్ళు సహజంగా మన చర్యలను గమనించి ముసలి వయసులో నిర్లక్ష్యం చేస్తే మరల అదే-తిన్నామా,పడుకొన్నామా......!!!!!
(పిక్చర్స్ వరుసగా ( పైనుంచి కిందకు) ఐరన్ ఓర్ లారీలతో కళకళ లాడుతున్న, అత్యద్బుతమైన హరనాదపురం-రామలింగాపురం సర్వేపల్లి కాలువ రోడ్డు మరియు బ్రిడ్జి!!! జూలై 8,2008 నాడు ఈనాడులో ని వార్త )

5 comments:

Rajendra Devarapalli said...

మీరు మరీ బడాయిలకు పోయి,మీ ఊరి గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు గానీ,మీరు రాజమండ్రి చూసారా?అనకాపల్లి?ఇవన్నీ కాదంటే మీరు ఏలూరు వెళ్ళాలి.కారణం ఆ ఊరు కు ఒక గొప్ప బిరుదు ఉంది,డస్ట్ బిన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని,ఇప్పుడు చెప్పండి నిజంగా మీ నెల్లూరుకు ఆ ఘనత ఉందా??

Ghanta Siva Rajesh said...

అవును నిజమె నేను ఈదరితొను ఎకిబవిస్తునా.

త్రివిక్రమ్ Trivikram said...

చాణుక్య గారూ,

మీ ఊరి సమస్యల గురించి మీరు పడే ఆవేదన సమంజసమే. ఐతే ఐరన్ ఓర్ లారీలు వచ్చేది కడప జిల్లా మీదుగానే తప్ప కడప జిల్లా నుంచి కాదు. అవి కర్ణాటకలోని బళ్ళారి-హోస్పేట ప్రాంతం నుంచి ఐరన్ ఓర్ ను తీసుకుని వస్తాయి. పోర్ట్-టు-పోర్ట్ కనెక్టివిటీ కింద కృష్ణాపట్నం-నెల్లూరు-బళ్ళారి-ముంబై రోడ్డును అభివృద్ధి చెయ్యాలనే ప్రణాళిక ఉంది. ఐతే అది పూర్తి అయిందో లేదో నాకు తెలియదు. ఇక రాష్ట్రప్రభుత్వం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో కడప-నెల్లూరు రైలు మార్గాన్ని నిర్మించాలని తలపెట్టింది. అది పూర్తైతే ఈ సమస్య ఉండదు.

Sujata M said...

baavundi. maa akkayya nellore lone undi. tanu, vallaayanaa kalipi mineral water company lanu poshistunnaru.

Ramanaiah said...

We cant change the scenario by sitting before computers