Saturday, July 5, 2008
వెర్రి వేయి రకాలు
నెల్లూరు ప్రజలకు, ఒకరెవరన్నా ఓ లాభసాటి పని అని చేపడితే అంధరూ పొలోమని దాని వెనుకే పడే అలవాటుంది. గత సంవత్సరం వరకు రొయ్యల వ్యాపారమని పచ్చని పొలాలను మాయం చేసారు.వంద మందిలొ ఓ ఐదుగురు లాభపడగా మిగిలినవారు బోర్డు తిప్పేశారు.ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇబ్బడి ముబ్బడి గా భూముల ధరలు పెంచేసారు.ఇటువంటి వ్యాపారానికి కావలసింది బాగా గాలి వార్తలు (పుకార్లు) పుట్టించడము-అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.ఫలాన వూళ్ళో అంకణం ఇంత రేటంటే అంత రేటని ,వున్న రేటుకు పదింతలు చేసి కూర్చున్నారు. ధరలు మరింత పెరుగుతాయన్న భయం తో ఈ మాయ మాటలకు మోసపోయి ఆదరాబాదర ఎక్కువ రేటుకు కొనుక్కొని వాటిని తిరిగి అమ్ముకోలేని స్థితి దాపురిస్తున్నది. ఆదివారమయితే చాలు,ఈ మధ్య కొత్త తరగతి ఒకటి రోడ్ల ప్రక్కన కనబడుతున్నది.వీళ్ళ పని ఏమిటంటే ఖాళీ స్థలాలు ఎక్కద కనబడితే వాటిని తెరిపారాచూడడము,వాటితో బిజినెస్ చేసినట్లు( తమని తాము ఏ జనచైతన్య ఓనర్ లాగా) ఫీల్ కావడము. ఇద్దరినుంచి పది మంది వరకు గుంపులుగా మోటరు సైకిళ్ళు వేసుకొని తిరుగుతూ సిగరెట్టు పాకెట్టు అయిపోయినదాక మాట్లాడుతూ గుట్కాలు నములుతూ,వూస్తూ అప్పుడే కోటీశ్వరులు అయిపోయినట్టు కలల సామ్రాజ్యంలో విహరిస్తుంటారు !వీళ్ళకు రాజధాని రియాల్టర్లు ఆదర్శము! నెల్లూరు లాంటి మూడో తరగతి కార్పొరేషనులో బాగా సంపాదించేసి,జిల్లా లో పలుకుబడిగల వ్యక్తిగా హైద్రాబాద్ లో అడుగు పెట్టాలని కలలు కంటుంటారు. ఒక వూరు కొంచమన్నా బాగుపడాలంటే నాగరికతకు చిహ్నాలు అనబడిన రోడ్స్ బాగుపడాలి. నెల్లూరు లోని రహదారులలో ఒకసారి తిరిగితేచాలు,మనకు నిస్సందేహముగా నమ్మకము కలుగుతుంది,ఇంకా మనము రాతి యుగములోనే వున్నామని.దశాబ్దాలకొలది విస్తరణకు నోచుకోని ట్రంకు రోడ్డు,చిన్న బజారు,చెత్తతో నిండిన ఇరుకైన వీధులు,కనకమహలు సెంటర్,హరనాదపురము,ఏది చెప్పుకొన్నా ఏమున్నది గర్వకారణము.ఇదంతా చూస్తుంటే పాత సామెత గుర్తుకొస్తోంది-వుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.ఆర్దిక పరంగా ఒక వ్యక్తి సొంత ఇల్లు అని కట్టుకోవాలంటే వస్తున్న సంపాదనలో కొంత మిగులు చేసేటట్లు వుండాలి.పెరుతున్న చమురు ధరలు,వంటసామానులు,పిల్లల చదువులకే సంపాదనంతా హరించుకుపోతుండగా,ఇలా తామకు తాము రేట్లను పెంచేసుకోవడము తమ గొయ్యి తామే తీసుకొంటున్నట్లు. షార్ట్ టెర్మ్ గెయిన్స్(కమిషన్ (పర్సంటేజులకు)) కు ఆశ పడి రియాల్టర్ల చేతుల్లో మోసపోవడము తప్ప మరేదికాదు ఇది . మింగ మెతుకు లేదు,మీసాలకు సంపంగి నూనె అన్న సామెతను ఋజువు చేస్తున్న నా నెల్లూరు ప్రజలకు రియల్ ఎస్టేటు ప్రభంజనం అన్న భూతాన్నుంచి నుంచి విముక్తి కలగాలని ప్రార్ధిస్తూ సెలవ్
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అయ్యా,ఈవెర్రి ఒక్కనెల్లూరికే పరిమితం కాదండి,కోస్తాలో దాదాపు అన్ని చోట్లా పాకింది.ఇక విశాఖపట్నం లాంటి నగరాల్లో చెప్పనక్కరలేదు.
మీరు భూములు ఖరీదు చెయ్యటానికి వచ్చి ఊహాలోకాల్లో తెలిపోయే వారిని గురించి చెప్పారు కానీ,వీరి వెనుక ఉండి ఎగదోలే వాస్తునిపుణులు,హస్తసాముద్రిక,జ్యోతిష్యాస్త్ర ప్రవీణులు,చిలకప్రశ్నల పండితులు వీరిని వదిలేసారె?
బాగా రాస్తున్నారు,కొనసాగించండి.
బావుందండి! చక్కగా చెప్పారు! ఈ వెర్రి, రాజేంద్ర గారన్నట్టు తెలంగాణా పుణ్యమా అని కోస్తా అంతా కలరా కన్నా వేగంగా పాకింది.
రాజేంద్ర కుమార్ గారు అన్నట్లు ఈ వెర్రి అంతటా ఉంది సర్. నిజంగా ఈ వెర్రికి పులిస్టాప్ పడాలి. వేచిచూద్దాం... వర్మ
Post a Comment