Tuesday, September 11, 2007
బాబోయ్,రద్దీ !!!!!
మన భారత దేశనియమాల ప్రకారము,మనము మన vehicles ను ఎడమ వైపు నడపాలి.కాని దాని అసలు,సిసలు అర్ధం ఎక్కడ ఎడమ దొరికితే,అక్కడ నడపమని!హైదరాబాద్ traffic ను మొదటి మారు చూసినప్పుడు,మరీ ఈ అమీర్ పేట వద్ద దారుణం అని చెప్పాలి.ఇరుకు roads ఒక కారణం అయితే,ముఖ్యమైన కారణం మన civic sense లేని వాహన చోదకులే.ఒక flyover అక్కడ అత్యవసరమని మన government కూడ ఏనాడో మరచిపోయింది.చివరకు అంబులన్సులు,ట్రాఫిక్ పోలీసింగ్ వాహనాలు కూడ స్తంభించిపోయి ఒక ఇంచి కూడ కదలలేని పరిస్థితిలో వుండడము షరామామూలే. మనకు ఎక్కడా కనీసము ఒక foot-overbridge కూడ కనుపించదు.ఎటువంటి markings లేని చోట కూడ పాదాచారులు యదేచ్చగా road ను దాటుతూ కనబడడము నిత్యకృత్యం.ఒక వేళ మనమే ఒక vehicleను drive చేయాల్సిన దురదృష్టం పట్టితే,మనము బ్రహ్మ లాగు చతుర్ముఖుడై వుండాలని ఓ అభిప్రాయము వుండేది-ఏ వైపు నుంచి ఏ vehicle నో లేక పాదాచారో హటాత్తుగా వస్తే save కావడానికి! కాని ఈ నా అభిప్రాయాన్ని పంజాగుట్ట flyover కూలిన పిమ్మట మార్చుకున్నాను,మనము ఈ hyderabad లో బతికి బయట కట్టాలంటే పంచముఖ బ్రహ్మ అయివుండాలి అని. ఎక్కడి నుంచి ఏ బండనో లేక ఏ కరెంట్ కేబులో నెత్తిన పడబోతుంటే కనీసము పారిపోవడానికి సమయం అన్నాదొరుకుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
పాపం ఐదో తలకాయ వుండేదిటండి - ఆ flyover కూలినప్పుడు ఊడిపొయిందిట
సిగ్నళ్ళ దగ్గర మన ట్రాఫిక్కాట హాకీ, ఫుట్ బాల్ లను గుర్తుకు తెస్తుంది నాకు. ఈ ఆటల్లో అవతలివాడి గోలు మీద దాడి చేసేందుకు సూటిగా, ఎదురుగా వెళ్ళరు (సాధారణంగా). ఓ పక్కకు వెళ్ళి, ఏ కార్నరుకోసమో, పెనాల్టీ కార్నరు కోసమో ప్రయత్నం చేస్తారు. మనం కూడా మన సిగ్నళ్ళ దగ్గర వీలైనంతవరకూ ఎడమ చివరికి వెళ్ళి అక్కడి నుండి ట్రాఫిక్ లైట్ల మీద దాడికి ప్రయత్నం చేస్తాం. నేరుగా వెళ్ళేవాడే కాదు, కుడి పక్కకు తిరగాల్సిన వాడు కూడా అక్కడే తన దాడిని కేంద్రీకృతం చేస్తాడు. మనమెళ్ళాల్సిన లేనులో అప్పటికే ఆగినవాడి వెనకాల నిలబట్టం అనేది మనకు పిచ్చితనంగానూ, చేతకానితనంగానూ కనిపిస్తుంది. ఎడమ పక్కకు పోవాల్సిన వాళ్ళు ఏంచేస్తారు.., ముందున్న వాణ్ణి బూతులు తిట్టుకుంటూ, హారను కొడుతూ ఉంటాడు.
Post a Comment