Wednesday, September 5, 2007

తెలుగు వాళ్ళు,అనామకులు

తెలుగు వాళ్లలో ఎంతో మంది తెలివిగల వాళ్ళు, even genius లు కూడా వున్నారనడంలో సందేహం లేదు.కాని అసలు మనల్ని మనము గుర్తించుకొంటున్నామా?ఒక విషయం మటుకు వాస్తవం.భారతదేశములో ఆంధ్ర ప్రదేశ్ border వెలుపల ప్రజలు చాలమందికి తెలుగువాళ్ళ గూర్చి అసలు తెలియదు.North Indiaలో మనగూర్చి తెలిసింది శూన్యమని చెప్పాలి.మధ్యమధ్యలో తమిళ్నాడు ,కర్నాటక గూర్చో లేక కేరళ వార్తలు తెలుస్తుంటాయి గాని మనల్ని ఒక్క నాధుడూ పట్టించుకొనే పాపానికి పోడు. మనలో ప్రతివారికి అమితాబ్ బచ్చన్ ఎవరో తెలుసు.అతని పేరు భారతదేశము వెలుపుల కూడ వ్యాపితము.కాని andhra వెలుపల ఎంతమందికి NTR,ANR ల గూర్చి తెలుసు?ఏ తెలుగు రచయిత పరిచయమున్నాడు andhra border బయట?కాని మనకు ప్రేంచంద్,శరత్,తస్లీమనస్రీన్ లంటే కొట్టిన పిండి!బాపు-రమణ ద్వయం(genius combination) ఎంతమంది తెలుగేతరులకు తెలుసు?విశ్వనాథ్ ఎవరని ప్రశ్నిస్తే వాళ్ళు కళ్ళు తేలవేస్తారు.అసలు మనలోనే ప్రశ్నించిచూడండి-రావూరి భరద్వాజ ఎవరని.ఎంతమందికి తెలుసో మీకే తెలుస్తుంది.ఇలాంటి వుదాహరణలు ప్రతి రంగం లో కోకొల్లలు.ఎంతో మంది మహానుభావులు మౌనంగానే వెళ్ళిపోయారు.ఇటువంటి పరిస్థితికి కారణహేతువులు మనమే.మనలను మనం గుర్తించుకోనపుడు,బయటి వాళ్ళెవరో వచ్చి దండలు వేస్తారనుకొవడం హాస్యాస్పదం.

4 comments:

Solarflare said...

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదండి - ఈ మాట ఏ తెలుగువాడినడిగినా చెప్తాడు. అదీ మన తెలుగు ఫిలాసఫి.

వేణు said...

బాగా చెప్పారండి. అసలు మనవాల్లకే తెలుగు అంటే పడదు. ఎప్పుడు చూసినా ఆ హింది వాల్లని నాకడంతోటే సరిపోదుంది. ఇద్దరు తమిళవాల్లు ఎక్కడ తారసపడ్డా తమిళ్ లోనే మాట్లాడుకుంటారు. అదే తెలుగువాల్లకు నామోషీ ఎక్కువ, ఇంగ్లిష్ లేదా హిందిలో మట్లాడుకుంటారే తప్ప తెలుగు అసలు వాడరు. ఇక తెలుగు పుస్తకాలు చదవరు. తెలుగు సినిమాలు చూడరు. మాతృబాష మీద ఏమాత్రం మమకారం లేదు. వీల్లను బాగుచేయడం ఎవరితరం కాదు.

ఇవన్ని రొజూ మా ఇంట్లో నే జరుగుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్షులం నేను మా నాన్నగారు. అందుకు పెద్ద ఉదాహరణ, మా నాన్నగారు 40 సం. కష్టపడి సేకరించిన 3000 పుస్తకాలు పాత పుస్తకాలవాడి వశం అయ్యాయి ఎందుకూ పనికిరావని చెప్పి.

lalithag said...

తెలుగు వారంటే మనమే కదా.
మన వారి గురించి మనం తెలుసుకుందాం.
పరిచయమైన తెలుగేతరులకి పరిచయం చేద్దాం.
ఈ ఉద్యమానికి వికీ, బ్లాగులు సహాయ పడతాయి.

నాకైతే నిజం చెప్పాలంటే కొంతమంది గురించే తెలుసు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా గట్టిగా చెయ్యచ్చనుకోండి. కనీసం మన భావి తరల వారికైనా వారి heritage ను సగర్వంగా పరిచయం చేసుకునే అవకాశాన్ని కల్పిద్దాం.

తమిళ సోదరులనడిగితే ఎక్కువ పేర్లు తెలుస్తాయేమో తెలుగు ప్రముఖుల గురించి:-(

chanukya said...

చండీఘర్ లో వున్నపుడు మొదట్లో etv ఒక్కటే వచ్చేది.ఆ సుమన్ ని,మరియు అతని భజంత్రి ప్రభాకర్ ను చూడలేక చచ్చేవాళ్ళము.మరో దిక్కు లేదు మరి!కొనాళ్ళకు అది అదృష్టవశాత్తు paid channel అయినతర్వాత మా cable వాడు దానిని పీకేసాడు.కొంతకాలానికి ZTV తెలుగు ప్రత్యక్షమైనా చివరకు అదీ కనుమరుగైంది.CableTV operatorకు ఎన్నిమార్లు చెప్పినా,ఏం లాభం.అదిగో ఇస్తాం,ఇదిగో వచ్చేసింది అని కబుర్లు చెప్పుతూ కాలం వెళ్ళబుచ్చాడు.ఈ hyderabad కు వచ్చిన తర్వాత,TV పెడితే చాలు,అర్ధం కాని భాషలు,లిపులతో ఎన్నో regional channels!అబ్బ,మనది ఎంత విశాలహృదయం!!!!
(కొస మెరుపు):ఇంతకు ఆ ETV కి ప్రభాకరగ్రహం ఇప్పటికీ వీడినట్టులేదు!!!??