Tuesday, July 6, 2010

వంది మాగధురాళ్ళు, ప్రమోదాలు వెనుక ప్రమాదాలు !

ఒక మనిషి ఎదిగాడంటే అతని చుట్టూ పోగయ్యే వాళ్ళలో opposite sex కూడా వుంటుంది.మొగుడిని వొదిలేసిన మురికిముండలు,ఒంటితో తప్ప ఇక మరి ఏ ఇతర మార్గంద్వారా బ్రతకలేని కొందరు పోగవుతారు. వీళ్ళు ఏకులా వచ్చి మేకులా తయారైన చందాన, సర్వ కాల అనంత సేవలు చేస్తూ ఎవరైన కొత్తవారు వస్తే వాళ్ళని కూడా అనుమానంగా చూస్తారు.Insecurity మరి. ఒక వేళ యజమాని తమకు లోబడ్డాడా ,ఇక అంతే,అసలు భార్య కంటే తాము ఆ organization కి అధినాయకురాళ్ళలా వూహించుకొంటూ సాద్యమైనచోట లేని అదికారాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త వాళ్ళ వద్ద అయితే ఇంకా easy గా వుంటుంది కాబట్టి, pseudo దర్పాన్ని చూపుతారు. ఇక వచ్చిన వాళ్ళకు త్వరలోనే దాదాపు అన్ని విషయాలు అందరు చెవిలో ఊదేస్తారు.దాంతో,వాళ్ళ మనసులో యజమాని అంటే ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఎదురుగా ఏమి మాట్లాడకపొయినా తమ పని తాము చూసుకోవాలి కాబట్టి,మనసులో ఒక emotional detachment జరిగిపోతుంది. ఒక organization ఎంత గొప్పదైనా అది నాశనమవుతుందంటే లేక ఎదగలేక పోతుందంటే main reason- lack of communication.
చుట్టూ జరుతున్న వీటన్నిటిని చూస్తుంటే నాకొక idea వస్తోంది. చిన్నపుడు చదివిన నీతి చంద్రిక/పంచ తంత్రము ను ఎవరయిన business లో అడుగుపెడుతున్నపుడు,లేక higher position కు ఎదుగుతున్నపుడు మరల compulsory గా చదివించాలని . అటువంటి పుస్తకాలు నిజంగా చిన్నప్పటికంటే పెద్దయినపుడు చదివితేనే బాగా అర్ధమవుతాయి.

Sunday, December 27, 2009

ఇంద్రుళ్ళు-చంద్రుళ్ళు

1987 లో ఇంద్రుడు-చంద్రుడు సినిమాను చూసి,జనాలు నిర్ఘాంతపోయారు,తెలియని విషయాలు తెలిపినందుకు ఆ సినిమా ను hit చేసారు.ఆ చిత్రంలో తన Mayor పదవిని అడ్డుపెట్టుకొని ఓ middle age politician మంచి రసికుడని నిరూపించుకొంటాడు! ఇందులో మరో High light ఏమిటంటే ఆ mayor వద్ద పనిచేసే secretary తన భార్యను ,చెల్లి అని చెప్పుకొంటూ mayorను ఆమె ద్వారా లొంగదీసుకొని double game ఆడుతాడు.చివరకు తన స్త్రీ లోలత్వానికి mayor బలైపోతాడు. ఆ పాత్ర చేసిన కమల్ హాసన్ సహజ నటన కు ప్రేక్షకులు జేజేలు పలికారు. 1990లలో వచ్చిన కమల్ హాసన్ మరో సినిమా " మహా నది" ఈ politicians చేసే child trafficking,,పిల్లలతో వీళ్ళు చేసే నీతి బాహ్యమైన చర్యలను వెలుగులోకి తీసుకొని వచ్చింది. అలాగే Page 3 సినిమాలో డబ్బుతో పెట్టిపుట్టినవాళ్ళు కొందరు, child sexual abuseకు పాల్పడీ, తమ political nexus తో ఎలా చట్టాన్నుంచి తప్పించుకొంటారో చూపించారు.
ఇదిలా వుంటే, N D Tiwari ఏదో పాపం మన యువత నెట్ మీద, దొంగ సీడీ ల కోసం వెంపర్లాడడము చూసి,ఏదోలే పాపం, పోయే ముందన్నా, free గా రసిక ఫిల్మ్ లు పంచించి కొంత జనసేవ చేస్తామనుకొంటే మన పేపర్లు,టీ వీ న్యూస్ చానళ్ళు అతని దేశ భక్తిని సరిగ్గా గుర్తించక ఆడిపోసుకొన్నాయి! పొర్నో సైట్సును ప్రపంచంలోనే ఎక్కువగా వీక్షించేది మన భారతీయులనేది జగమెరిగిన సత్యం! అలా గంటలు,గంటలు ఎందుకు టైం వేస్ట్ చేసుకొంటున్నారు ఈ నా భారతీయ సహోదరులని,వుడతాభక్తి సహాయంగా మన గవర్నర్ చేయబొయి భంగపడ్డాడు! ఎందుకు చెప్పండి ఈ కాటికి కాళ్ళు చాపుకొన్న వయసులో ఈ సేవ !? ఎక్కడో నిజాయితీగా Tiger Woods నిజం వొప్పుకొంటే ,పత్రికలు ఏకి పారేసాయి ప్రపంచ వ్యాప్తంగా!! అతనితో వున్న వ్యాపార సంబందాలను రద్దు చేసుకొన్నాయి బడా కంపెనీలు. Bill Clinton చేయక చేయక ఒక తప్పు చేస్తే అతని presidency post నే వూడే పరిస్థితి వచ్చింది. మనల్ని చూడండి, మనము ఎంత దొరబాబులమో,మనల్ని మనము ఎంత దులపరించుకొంటామో, ఎంత కుహానా వాదులమో- Cricketలో match fixing కి పాల్పడి,నిజం వొప్పుకొన్న్న South Africa Captain Hansie Cronje చివరకు విమాన ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. అదే పని చేసిన మన అజరుద్దీన్ ఒక రాజకియ నాయకుడి అవతారం లో వున్నాడు. అజయ్ జడేజా TV లలో cricket commentary,expert opinion ప్రొగ్రాములలో నిర్లజ్జగా పాల్గొంటాడు. ఇదంతా చూస్తూవుంటే, నాకు ఒక సందేహం వస్తుంది.నిజంగా నైతిక విలువలు వుండేది మనకా లేక మనం తెగ అవహేళన చేసే తెల్లవారికా?
ఏదో పాపం బద్దలయ్యి,మన పెద్ద వాళ్ళు అనుకొంటున్నట్లు, Tiwari బయటపడ్డాడు గాని,వెలుగు చూడని పెద్ద మనుషులు ఎందరో మన సమాజంలో-గుమ్మడికాయల దొంగ బుజాలు తడుముకొన్నట్లు urgentగా అతనిని సమర్దించిన ఇద్దరు ముసలి MP ల మీద అనుమానము కలుగుతోంది. Coaching centers పెట్టుకొని,తర్వాత రాష్ట్రవ్యాప్తంగా private colleges విద్యావ్యాపారం చేస్తూ,Medical మరియు Engineering colleges ను కలిగివున్న అధినాయకుడి భాగోతాలు క్రిష్ణ లీలలను మించిన లీలలు. రాజకీయ నాయకులకు, అధికారులకు ఇతడు ఓ పెద్ద తార్పుడుగాడు. Platinum పరుపులమీద సినీ నాట్య తారతో సేదతీరుతూ, తనకు అన్నివిధాల సహకరించే ఓ స్త్రీకార్యకర్తను, Mayor చేసి,నల్ల కళ్ళద్దాలతో, TV మీద తెగ హడావిడి చేస్తాడు-ఓ సీనియర్ MLA. శివలింగాలకు TVలలో పూజ చేస్తూ ,తన కామ లింగాన్ని సంత్రుప్తి పరచుకొనేవాడు ఓ MP. గవర్నరును తెగ విమర్శించిన ఓ పార్టీ నాయకుడి,ఇప్పుడు UP MP అయిన ఓ మాజీ సినీ తారతో నడిపిన భాగోతం రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. అధికారంలో ఎవరువుంటే వాళ్లకు చెంచాగిరి చేసి,ఏకధాటిగా పది సంవత్సరాలు తిరుపతిలో ఓ హాస్పిటల్ Head గా ఏడుకొండలవాడి డబ్బు కాజేసిన ఓ doctor స్త్రీల వ్యవహారములలో మరో పెద్దమనిషి. అవును మరి,దొరకనివాడు దొరే! చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి గా వున్న మధు కోడా, ప్రజల డబ్బును సెలీనా జైట్లీ,కొయినా మిత్రాల ఆర్దిక పరిస్తితి చూసి చలించి వారికి పంచడం చూసి,అతని జాలి గుండె కు జనాలు ఆనందంతో కన్నీళ్ళు పెట్టారు!
ఈ విషయాలన్ని ముందే బహిర్గతమైవుంటే పూరీ జగన్నాధ్ తన " పొకిరి" లో ముమైత్ ఖాన్ పాట ఇలా పాడించే వాడేమో-"ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ,చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ MP,MLA లే,వాళ్ళ చెంచాగాళ్ళూ నన్ను వదలట్లే. తివారీకి నేను ఒక్కటే చాలట్లే, మరో ఇద్దరు తోడుండాలే " !!!