Tuesday, September 22, 2009

మనిషిని తప్పుడు త్రోవను పట్టించేవన్నీ కలగలిసినపుడు

మనమందరము చిన్నపుడు కామ,క్రోధ,లోభ,మద మరియు మాత్స్యర్యములనేవి అరిషడ్వర్గములని చాలా మార్లు చదివివుంటాము.కాని వయసు వచ్చేకొద్దీ అదేమి ఖర్మమో మన విషయ బుద్ధి వికసించి,ఙ్నాన బుధ్ధి క్షీణించడం మొదలవుతుంది. ఒక మగాడు నాశనం అయ్యే కారణాలలో ముఖ్యమైనది స్త్రీ పిచ్చి అని నా నమ్మకము. కావాలంటే పరిశీలనగా చూడండి పై మొదటి వాక్యాన్ని, ఐదు లక్షణాలలో దేనికి మన పూర్వీకులు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చారో. ఎంత వారలమైనా కాంత దాసులమే అన్న నానుడిని నిజం చేస్తూ, ఎంతో ఎదగవలసిన మగాడు అధఃపాతాళానికి జారి పోతాడు.నీచమైన పనులు చేస్తూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందాన ప్రవర్తిస్తుంటాడు.అదేమంటే తన టెన్షన్ ను అలా రిలీవ్ చేసుకొంటుంటానని బుకాయిస్తుంటాడు! లారీ డ్రైవర్ టెన్షన్ లారీ డ్రైవర్ ది మరి,ఎక్కడ ఏక్సిడెంట్ చేస్తానేమోనని, అలాగే డబ్బులు సంపాదించేవాడి టెన్షన్ వాడిది, ఇంకా ఎక్కువ సంపాదించాలని మరియు వున్నది ఎక్కడ పోతుందేమోనని. అధికారంలో వున్నవాడికి అదే తంటా మరియు అది తెచ్చే టెన్షన్. ఇలా వీళ్ళు అందరూ ఒకే చందాన చీకటి వేళకు రిలాక్సేషన్ కోసం ప్రయిత్నిస్తారు,స్థలాలు మారుతాయి అంతే తేడా! దీనికి చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. నాటి రావణాసురుడు,ఇంద్రుడు,కీచకుడు,బాల నాగమ్మ ను మోహించిన మాయల ఫకీర్ నుంచి నేటి బిల్ల్ కింటన్, రామారావు, సిల్వియొ బెర్లుస్కోని, మా ఎం ఎల్ ఎ, నికొలాస్ సార్కోజీ,నారాయణ ఇలా ఎందరో. బయిటపడని ఘటికులు గూర్చి చెప్పనవసరములేదు. ఫైనల్ గా అర్ధమైనది ఏమిటంటే క్రోధం లేక లోభం కానివ్వండి. మద,మాత్సర్యాలు కానివ్వండి.చివరకు ఇవి కూడినపుడు వుద్భవించేది కామం అనే మహా వినాశనహేతువు. పోనీ ఇలా బ్లాగులలో చూస్తామా ,ఆహ,ఓహో అంటూ కొన్ని స్త్రీల బ్లాగులను కామెంట్లతో ముంచెత్తే భట్రాజులు.

Sunday, September 20, 2009

గుణం లేని చోట పని చేయడం

ఒక వుద్యోగము అంటే అది పని చేసేవాళ్ళు మరియు పని చేయించుకొనేవాళ్ళ మధ్య వుండే interaction.Mutual understanding మీద ఆధారపడిన వాతావరణం. అది చెడిందంటే చాలా సంధర్బాలలో కారణం, ఇరువైపుల వుంటుంది. ముఖ్యంగా పని ఎక్కువలేనిచోట, దెయ్యాలు నాట్యం చేస్తుంటాయని నానుడి. ఒక వ్యక్తి దగ్గర డబ్బులుంటాయని చూచాయిగ తెలిస్తే చాలు ,పందికొక్కులు చేరి పోతాయి. మరల వాటిల్లొనే వాటికి పడవు! ఒక దానితో ఒకటి కలహించుకొంటుంటాయి. ఏ పందికొక్కు యజమాని ప్రాపకం బాగా పొందుతుందో, అది మిగిలిన వాటిని తరిమేయాలని చూస్తుంటుంది. ఇటువంటి గాదె క్రింద పోరాటాలు middle management levelలో బాగా చూడవచ్చు.
కాని పెదపంది కొక్కుకి ఎప్పుడూ అభధ్రతా భావం వుంటుంది, ఎక్కడనుంచి మిగిలిన వాటినుంచి ప్రమాదం ముంచు కొస్తుందోనని! దాంతో దానికి ప్రపంచంలో ప్రతిఒక్కటి అనుమానాస్పదం గా కనబడడం మొదలవుతుంది.ఎక్కడన్న ఏదైన తనను లక్ష్యపెట్టడం లేదని తోస్తే, తన వునికికే ప్రమాదం వస్తుందన్న అనుమానంతో ఎటువంటి క్రూరపు పనైనా చేయడానికి వెనుకాడదు. అటు వంటి చోట్ల, ఉద్యోగం కోసం చేరిన వాళ్ళ నిత్యావస్థలు చెప్పనలవి కాదు.అటు పెద పందికొక్కుతో వేగలేక, మిగిలిన పందికొక్కుల తో కూడ వుండలేక గిల గిల కొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. కొంతమంది చూసి చూసి చివరకు,ఆ సమూహం లో కి metamorphosis అవుతారు!

Tuesday, July 8, 2008

ఓటేయండి!!!!

ఇదేదో ఎన్నికల అభ్యర్దన అనుకొనేరు!!! కానే కాదు.దానికి వేరేవాళ్ళు వున్నార్లేండి!.
ఇంతకి ఈ విన్నపము దేనికంటే నా పూర్వ బ్లాగులో మా నెల్లూరు గూర్చి మాట్లాడుతున్నపుడు రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు ఏది Dust bin of Andhra Pradesh అన్న విషయంలో నాతో పోటీపడ్డారు...ఏలూరు నంబర్ ఒన్ అని! అప్పుడు నాకు తోచింది,ఇది ఎలాగు ఎన్నికల కాలము కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా solution వెతుకుదామని, మన రాష్ట్రంలో అన్నీ వూళ్ళ మద్య పోటీ పెడితే బాగుంతుందని!! ఈ Online election లో పాల్గొని విరివిరి గా మీ అమూల్యమైన వోట్లను వేసి పరిష్కరించప్రార్ధన(Comments section లో మీ వోటు వేయ మనవి)!!! ఫలితాలలో ఏ వూరుకు ఎక్కువ వోట్లు పడుతాయో దానిని విజేతగా ప్రకటించుదాము!!!!

Monday, July 7, 2008

సొగసు చూడతరమా!!!!






















వెల్ కం టు నెల్లూర్.
మా వూరికి రండి.మా ప్రగతిని చూడండి.మా వున్నతనాన్ని ఆస్వాదించండి.మా వూళ్ళొ మీకు చాలా వుచితంగా దొరుకుతాయి!టీబి,డయేరియా,టైఫాయిడ్,ఫైలేరియ తో పాటు ఐరన్ ఓర్ వల్ల కలిగే వింత వ్యాది కూడ విరివిరిగా లభిస్తుంది.కడప జిల్లానుంచి వచ్చే ఐరన్ ఓర్ లారీల వలన ఎంతో మంది వ్యాదుల బారిన పడుతుంటే,రహదారులు చిద్రమవుతుంటే నాకేమిటి,నేను నా ఇల్లు సుఖంగా వుంటే చాలు అన్న మనస్తత్వం మాది.ఇంత భారీ ప్రాజెక్టు సాగుతుంటే దానికి తగ్గ వసతి (కడప నుంచి క్రిష్ణపట్నం వరకు) ప్రత్యేక రోడ్ వేయాలని ప్రభుత్వం మర్చిపోగా, దానిని గుర్తు చేయాల్సిన మేము "తిన్నామా, పడుకొన్నామా,తెల్లారిందా" అనే దానిని తూ చా తప్పకుండా అమలుపరుస్తునాము!ఇళ్ళు కట్టడము,పిల్లలను చదివించడము,డబ్బు వెనుక పోగేసుకోవడం అనే మూడిటి నుంచిబయటపడని అచ్చమైన తెలుగు వారం మనము!ఈ మూడు తప్ప మరేదైన వున్నతమైనది ఈ లోకంలో వున్నదా అనే ఆలోచనను కట్టిపడవేసాం!ఈ సంకుచిత్వ భావాల ప్రతిబింబమే మన రాజకీయనాయకులు మరియు అధికారులు.వాళ్ళని ఆడిపోసుకుని ప్రయోజనము ఏమున్నది?ఇంత నేరో మైండెడ్ మెంటాలిటీ వున్నంతవరకు మన దేశం పురోగమించదు.మనకు ప్రతిరూపమైన ,మా నేరో రోడ్స్ ని చూడండి!
పచ్చదనం కానరాక,కాల్చేస్తున్న ఎండలతో సహజీవనం చేస్తాం! కొద్దిపాటి వర్షానికే మురుగుకాలువ నీళ్ళు భేదాపరాలు లేకుండా అంతా చేరుతాయి!గుంటనో మిట్టనో కానరాదు.అయినా ఫర్వాలేదు.పడిలేచి బురదను వాషింగ్ మెషిన్ లో వేస్తాం!రోడ్డు మీదనే యదేచ్చగా వుమ్మేస్తుంటాము,గోడ దొరికితే పాసులు పోస్తుంటాము!మన వాహనాన్ని ఎక్కడైన ఆపగలము,వెనుక బస్సులుఇతరత్రా హారను కొడుతున్నా!అదే దుమ్ము గాలిని ఆస్వాదిస్తూ,టీ తాగి,ప్లాస్టిక్ కప్ ని రోడ్ మీద పడవేస్తాం!స్వార్దానికి నిలువెత్తు ప్రతిరూపాలు,మన తెలుగు వాళ్ళము.పుస్తకాలలోని నీతులు పిల్లవాళ్ళకు చెప్పినా,వాళ్ళు సహజంగా మన చర్యలను గమనించి ముసలి వయసులో నిర్లక్ష్యం చేస్తే మరల అదే-తిన్నామా,పడుకొన్నామా......!!!!!
(పిక్చర్స్ వరుసగా ( పైనుంచి కిందకు) ఐరన్ ఓర్ లారీలతో కళకళ లాడుతున్న, అత్యద్బుతమైన హరనాదపురం-రామలింగాపురం సర్వేపల్లి కాలువ రోడ్డు మరియు బ్రిడ్జి!!! జూలై 8,2008 నాడు ఈనాడులో ని వార్త )

Saturday, July 5, 2008

వెర్రి వేయి రకాలు

నెల్లూరు ప్రజలకు, ఒకరెవరన్నా ఓ లాభసాటి పని అని చేపడితే అంధరూ పొలోమని దాని వెనుకే పడే అలవాటుంది. గత సంవత్సరం వరకు రొయ్యల వ్యాపారమని పచ్చని పొలాలను మాయం చేసారు.వంద మందిలొ ఓ ఐదుగురు లాభపడగా మిగిలినవారు బోర్డు తిప్పేశారు.ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇబ్బడి ముబ్బడి గా భూముల ధరలు పెంచేసారు.ఇటువంటి వ్యాపారానికి కావలసింది బాగా గాలి వార్తలు (పుకార్లు) పుట్టించడము-అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.ఫలాన వూళ్ళో అంకణం ఇంత రేటంటే అంత రేటని ,వున్న రేటుకు పదింతలు చేసి కూర్చున్నారు. ధరలు మరింత పెరుగుతాయన్న భయం తో ఈ మాయ మాటలకు మోసపోయి ఆదరాబాదర ఎక్కువ రేటుకు కొనుక్కొని వాటిని తిరిగి అమ్ముకోలేని స్థితి దాపురిస్తున్నది. ఆదివారమయితే చాలు,ఈ మధ్య కొత్త తరగతి ఒకటి రోడ్ల ప్రక్కన కనబడుతున్నది.వీళ్ళ పని ఏమిటంటే ఖాళీ స్థలాలు ఎక్కద కనబడితే వాటిని తెరిపారాచూడడము,వాటితో బిజినెస్ చేసినట్లు( తమని తాము ఏ జనచైతన్య ఓనర్ లాగా) ఫీల్ కావడము. ఇద్దరినుంచి పది మంది వరకు గుంపులుగా మోటరు సైకిళ్ళు వేసుకొని తిరుగుతూ సిగరెట్టు పాకెట్టు అయిపోయినదాక మాట్లాడుతూ గుట్కాలు నములుతూ,వూస్తూ అప్పుడే కోటీశ్వరులు అయిపోయినట్టు కలల సామ్రాజ్యంలో విహరిస్తుంటారు !వీళ్ళకు రాజధాని రియాల్టర్లు ఆదర్శము! నెల్లూరు లాంటి మూడో తరగతి కార్పొరేషనులో బాగా సంపాదించేసి,జిల్లా లో పలుకుబడిగల వ్యక్తిగా హైద్రాబాద్ లో అడుగు పెట్టాలని కలలు కంటుంటారు. ఒక వూరు కొంచమన్నా బాగుపడాలంటే నాగరికతకు చిహ్నాలు అనబడిన రోడ్స్ బాగుపడాలి. నెల్లూరు లోని రహదారులలో ఒకసారి తిరిగితేచాలు,మనకు నిస్సందేహముగా నమ్మకము కలుగుతుంది,ఇంకా మనము రాతి యుగములోనే వున్నామని.దశాబ్దాలకొలది విస్తరణకు నోచుకోని ట్రంకు రోడ్డు,చిన్న బజారు,చెత్తతో నిండిన ఇరుకైన వీధులు,కనకమహలు సెంటర్,హరనాదపురము,ఏది చెప్పుకొన్నా ఏమున్నది గర్వకారణము.ఇదంతా చూస్తుంటే పాత సామెత గుర్తుకొస్తోంది-వుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.ఆర్దిక పరంగా ఒక వ్యక్తి సొంత ఇల్లు అని కట్టుకోవాలంటే వస్తున్న సంపాదనలో కొంత మిగులు చేసేటట్లు వుండాలి.పెరుతున్న చమురు ధరలు,వంటసామానులు,పిల్లల చదువులకే సంపాదనంతా హరించుకుపోతుండగా,ఇలా తామకు తాము రేట్లను పెంచేసుకోవడము తమ గొయ్యి తామే తీసుకొంటున్నట్లు. షార్ట్ టెర్మ్ గెయిన్స్(కమిషన్ (పర్సంటేజులకు)) కు ఆశ పడి రియాల్టర్ల చేతుల్లో మోసపోవడము తప్ప మరేదికాదు ఇది . మింగ మెతుకు లేదు,మీసాలకు సంపంగి నూనె అన్న సామెతను ఋజువు చేస్తున్న నా నెల్లూరు ప్రజలకు రియల్ ఎస్టేటు ప్రభంజనం అన్న భూతాన్నుంచి నుంచి విముక్తి కలగాలని ప్రార్ధిస్తూ సెలవ్

Friday, October 5, 2007

ట్రాఫిక్ జోక్స్

హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన చంద్రమోహన్, friend రాంమోహన్ ఇంట్లో దిగాడు.రాంమోహన్ వుండేది అమీర్ పేటలో.ప్రతీరోజు నాలుగుగంటలకు ఒక మారు helicopter చక్కర్లు కొట్టడం చూసి అడిగాడు-ఇక్కడేమైన దగ్గర్లో helicopter training center వున్నదా?
రాంమోహన్: అబ్బే అదేమి లేదు!
చంద్ర మోహన్: మరి ఆ helicopter అన్ని సార్లు ఎందుకు తిరుగుతోంది?
రాంమోహన్(పక పక నవ్వేస్తు): అది traffic jam లో ఇరుక్కున్న వాళ్ళకు ఆహార పొట్లాలు విడవడానికి!!!!!
**********************************************************************
పెళ్ళయి హైదరాబాద్ లో settle కాదల్చుకొంటే డబ్బులుగడించిన మామను అల్లుడు కోర్కే కోరిక ఏమిటి?!

"ఒక helicopter ను కొనివ్వండి. Traffic jam ను తట్టుకోలేను."
***********************************************************************
లకడీకాపుల్ బిచ్చగాడు పంజాగుట్ట బిచ్చగాడితో- " ఈ traffic jam ల పుణ్యమాని మనం తిరిగే బాధ తప్పింది"...!!!!!
************************************************************************

Saturday, September 15, 2007

Traffic లో tea తాగగలరా?!!!

ఇదేదో పిచ్చి ప్రశ్నలా వుంది కదూ? కాని ఇది నిజం!హైదరాబాద్ గూర్చే తీసుకోండి.ఇక్కడ vehicle నడపడానికి కూడ ఎడమ దొరకని విధంగా traffic వుంటుందన్నది జగమెరిగిన సత్యం.విస్తరించలేని roads,వాటిమీదకు చొచ్చుకువచ్చిమరీ వ్యాపారాలు చేసే shops,అడ్డదిడ్డంగా park చేసిన vehicles మరియు తోపుడు బళ్ళు. ఇక traffic jam కాకుండా ఎలా వుంటుంది?! నేను పని చేస్తున్న యశోద hospital, సోమాజిగూడ వద్ద traffic స్థంభించిపోవడం షరా మామూలే.అలా traffic నిలబడిందో లేదో చాలు,6 నుంచి 14 సంవత్సరాలు మధ్య వయస్సు వున్న పిల్లలు టక్కున ప్రత్యక్షమవుతారు "చాయ్, చాయ్" అని అరుస్తూ.చేతుల్లొ tea can మరియు disposable cups ready గా వుంటాయి.టూ వీలర్స్ చోదకులు ఈ వ్యాపారానికి మహరాజ పోషకులు!ఎలాగూ jam కనీసము 5 నిముషములు వుంటుంది కాబట్టి ఈ business కూడ బాగానేవున్నట్టుంది!!